Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్-అనుష్క మౌనం దేనికి సంకేతం..? ఇద్దరూ దానికి సిద్ధమైపోయారా...?

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న క్యూట్ జంట అనుష్క-ప్రభాస్. వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. పైగా ఇద్దరూ ముదురు వయసుతో వున్నారు. ప్రభాస్ కు 37 ఏళ్లుండగా అనుష్కకు 35 ఏళ్లు రన్నింగ్. బాహుబలిలో వీరిద్దరి మధ్య లిప్ కిస్ స

ప్రభాస్-అనుష్క మౌనం దేనికి సంకేతం..? ఇద్దరూ దానికి సిద్ధమైపోయారా...?
, శనివారం, 20 మే 2017 (13:31 IST)
బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న క్యూట్ జంట అనుష్క-ప్రభాస్. వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. పైగా ఇద్దరూ ముదురు వయసుతో వున్నారు. ప్రభాస్ కు 37 ఏళ్లుండగా అనుష్కకు 35 ఏళ్లు రన్నింగ్. బాహుబలిలో వీరిద్దరి మధ్య లిప్ కిస్ సీన్ చాలా గాఢంగా వుంటుంది. వీరి జంటను చూసిన వారు చాలా ముచ్చటగా వున్నారనీ, పెళ్లి చేసుకుంటే చూడాలని వుందని కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిపై ఇండస్ట్రీలోనే కాదు... నేరుగా అనుష్కకు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓ మీడియా సమావేశంలో అనుష్కను... రానా - ప్రభాస్ వీరిద్దరి గురించి మీరేం చెపుతారని అడిగితే... రానా నన్ను సిస్టర్ అంటుంటారనీ, నేను కూడా రానాను బ్రదర్ అని పిలుస్తుంటానని చెప్పింది. ఐతే ప్రభాస్ చాలా సెక్సీగా వుంటారనీ, ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని వుందని చెప్పుకొచ్చింది. 
 
కానీ రిలేషన్ గురించి మాత్రం చెప్పలేదు. పైగా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అని అడిగితే... జస్ట్ నవ్వులు విసిరింది. ఇదంతా చూస్తుంటే ప్రభాస్-అనుష్క ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే సూపర్ కపుల్ అని పేరు వచ్చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‌'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని'... ఇదీ హీరోయిన్ రెజీనా పరిస్థితి...