Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‌'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని'... ఇదీ హీరోయిన్ రెజీనా పరిస్థితి...

‌'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని' ఇదీ టాలీవుడ్ హీరోయిన్ పరిస్థితి రెజీనా. అందం చందం ఉన్న రెజీనాకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉండిపోయింది. ‌ఫ్లాపుల కన్నా సక్సెస్ ర

Advertiesment
Regina Cassandra
, శనివారం, 20 మే 2017 (11:56 IST)
‌'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని' ఇదీ టాలీవుడ్ హీరోయిన్ పరిస్థితి రెజీనా. అందం చందం ఉన్న రెజీనాకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉండిపోయింది. ‌ఫ్లాపుల కన్నా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నా స్టార్‌ హీరోలతో చేసే ఛాన్స్‌ మాత్రం అందుకోలేకపోయింది. అవడానికి తమిళ అమ్మాయే అయినా ఇంతవరకూ తమిళ తంబిల మనసు దోచుకోలేకపోయింది. చిట్టచివరకు తన మాతృభాషలో బిజీ అవుతున్న రెజీనాతో.
 
ఆమె ఓ పత్రికకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇక్కడ ఎప్పుడో బిజీ కావలసింది. భగవంతుడు నా కెరీర్‌ను మరోలా డిసైడ్‌ చేశాడు. అందుకే ఇక్కడ రావలసినంత పేరు రాలేదు. తమిళ అమ్మాయినే అయినా తమిళ సినిమాలు చేయడం లేదన్న బాధ ఎక్కడో ఓ మూల ఉండేది. ఇప్పుడు అది తీరిపోయింది. ప్రస్తుతం తమిళంలో వరుసగా ఐదు సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నవన్నీ నాకు పేరు తీసుకొచ్చేవే! త్వరలోనే కోలీవుడ్‌లో మంచి స్థాయికి చేరుకుంటానన్న నమ్మకం నాకుంది. 
 
సినిమా ఒప్పుకునే ముందు కథ ఏమిటి‌? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను తప్ప చిన్న హీరోనా? పెద్ద హీరోనా? బ్యానర్‌ ఎలాంటిదిలాంటి విషయం పట్టించుకోను. నా సినిమాలు పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. సినిమాల ఎంపికలో నా జడ్జిమెంట్‌ చాలా వరకూ కరెక్ట్‌గానే ఉంటుంది. అందుకే నా మీద ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర పడలేదు. ఇక పెద్ద హీరోలతోనే చేస్తేనే గుర్తింపు వస్తుంది అంటే నేను నమ్మను. దక్షి‍ణాదిన నాకు మంచి గుర్తింపే వచ్చింది. మంచి కథతో వస్తే ఎవరితో చేయడానికి అయినా నేను రెడీ. 
 
ఎవరినీ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం లేదు. నాకు షూటింగ్‌ లేకపోతే ఖచ్చితంగా సినిమా ప్రమోషన్లకు వస్తాను. షూటింగ్‌ ఉన్నప్పుడు రమ్మంటే ఎలా రాగలను? అదే విషయం చెబితే రెజీనాకు పొగరు. ప్రమోషన్లకు రమ్మంటే రాదు అంటారు. అసలు నేను చేసిన సినిమాల ప్రమోషన్లకు దాదాపు అన్నిటికీ నేను అటెండ్‌ అవుతూనే ఉంటాను. ఎప్పుడన్నా ఒక్క సినిమాకు వెళ్ళకపోయేసరికి ఇలాంటి మాటలు అనేస్తుంటారు అని వాపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో మరో మూవీ...