Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''బాహుబలి-ది కంక్లూజన్' ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎన్ని సంచలన విజయాలు సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోండగా, గత డిసెంబర్‌

Advertiesment
Baahubali
, బుధవారం, 17 ఆగస్టు 2016 (17:07 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎన్ని సంచలన విజయాలు సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోండగా, గత డిసెంబర్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను యూనిట్ ప్రారంభించింది. బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా బాహుబలి ది కంక్లూజన్ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్‌గా నటిస్తుంది.
 
 రమ్యకృష్ణ, రానా, తమన్నా, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలను కూడా యూనిట్ సభ్యులు ఇంతవరకు విడుదల చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం 'బాహుబలి-ది కంక్లూజన్'కు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. 
 
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. గతంలో కూడా 'బాహుబలి' చిత్రానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి కూడా ప్రభాస్ పుట్టినరోజు నుంచే ఫస్ట్ లుక్ విడుదల కానుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలా పాల్ బాటలో 'ఇల్లాలు ప్రియురాలు' చిత్ర హీరోయిన్ దివ్య ఉన్ని?