Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన 'అజర్' చిత్రం.. సంగీతా బిజ్లానీ అభ్యంతరం!

Advertiesment
Azhar: Ravi Shastri shown a womaniser
, మంగళవారం, 17 మే 2016 (12:43 IST)
భారత మాజీ క్రికెటర్‌ అజరుద్దీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "అజర్''. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చుట్టూ ఎన్ని విజయాలున్నాయో.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపంలో అన్ని వివాదాలూ ఉన్నాయి. టోని డిసౌజా దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా కపూర్లు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా సేవలందించిన అజర్ జీవితంలో సినిమాను తలపించే ఎన్నో మలుపులున్నాయి. 
 
వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో అజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో తమ పాత్రల చిత్రీకరణపై అజరుద్దీన్‌ మాజీ భార్య, నటి సంగీతా బిజ్లానీ అభ్యంతరం వ్యక్తం చేయగా, మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ ఏకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. అజర్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో మనోజ్ ప్రభాకర్ కీలక సాక్షిగా వ్యవహరించాడు. 
 
ఇప్పుడు ఈ చిత్రంపై టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి మండిపడుతున్నాడు. ఈ చిత్రంలో రవిశాస్త్రి తన భార్యను మోసం చేసినట్టు, అంతేకాకుండా దేశ క్రికెట్‌ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అతని పాత్రను చిత్రీకరించారు. ఇంకా భార్యతో కలిసి ఓ టూర్‌కు వెళ్లినప్పుడు ఆమె హోటల్‌లో ఉంచి మరో గదిలో ఓ మహిళను కౌగిలించుకొని ముద్దు పెడుతున్నట్టు చూపించడంతో రవితో అతని కుటుంబ సభ్యులు కూడా ఈ చిత్రాన్నిచూసి షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. మరి దీనిపై శాస్త్రి ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హాలీవుడ్ యాంకర్ బైసెక్సువల్ పర్సన్.. ఇన్‌స్టాగ్రామ్ ఫోటో తేల్చేసిందా?