Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంచరణ్ వంకరటింకర పనులు... అరవింద్ స్వామికి తిప్పలు.. ధృవ నుంచి తప్పుకునేనా?

Advertiesment
Arvind Swamy
, మంగళవారం, 31 మే 2016 (09:12 IST)
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, అల్లు అరవింద్ నిర్మాతగా, సక్సెస్‌ఫుల్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, సెన్సేషనల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ''ధృవ''. తమిళంలో ఘనవిజయం సాధించిన ''తని ఒరువన్'' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 
 
కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సీనియర్ హీరోని ఇబ్బంది పెడుతున్నాడట. అసలు విషయం ఏంటంటే... ఈ సినిమాలో విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం అరవింద్ స్వామి ఇప్పటికే చాలా డేట్స్ ఇచ్చేశాడట. కానీ ఆ డేట్స్‌ని వాడుకోకపోవడంతో అరవింద్ స్వామి మళ్ళీ ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వాల్సి వస్తుందట. దీంతో అరవింద్ స్వామి చాలా ఇబ్బందులకు లోనవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఇకపోతే అరవింద్ స్వామి ఇతర సినిమాలు ఒప్పుకోవడం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నారట. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం అరవింద్ స్వామి డేట్స్ కేటాయించారట. గతంలో డేట్స్ కారణంగా సినిమాటోగ్రాఫర్ తప్పుకున్న విషయం తెలిసిందే. మరి ఈసారైనా అరవింద్ స్వామి డేట్స్‌ని ఈ చిత్రం యూనిట్ వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహుమతులు ఇచ్చినందుకే నా సర్వస్వం సమర్పించుకున్నానంటున్న నటి