Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్కను టెన్షన్ పెట్టేస్తున్న స్వాతిముత్యం.. ఎందుకు?

అనుష్కను టెన్షన్ పెట్టేస్తున్న స్వాతిముత్యం.. ఎందుకు?
, శనివారం, 8 అక్టోబరు 2022 (16:15 IST)
సినీ నటి అనుష్క తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తోంది. ఇందులో అనుష్క కీలక పాత్రలో కనిపిస్తుండగా, ముఖ్యమైన పాత్రలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. కొంతకాలంగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా టీమ్ తెగ టెన్షన్ పడుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వారి కంగారుకు కారణం 'స్వాతిముత్యం' సినిమా అంటున్నారు. 
 
'స్వాతిముత్యం' కథ అంతా కూడా వీర్యదానం - సరోగసి అనే పాయింట్ చుట్టూ కామెడీని టచ్ చేస్తూ నడుస్తుంది. కామెడీని పక్కన పెడితే, అనుష్క సినిమా కథాంశం కూడా ఇదే పాయింట్ చుట్టూ తిరుగుతుందని టాక్ వస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివాత్మిక ఫోటోలు వైరల్.. గ్లామర్ పంట పండిస్తోందిగా..