Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

v6తో గొడవపడి బిత్తిరి సత్తిబాబు రాజీనామా.. ఉదయభానుతో ఆ ఛాన్స్?

తీన్‌మార్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియా్స్ రవి.. తాను పనిచేస్తున్న వీ6 ఛానల్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీ6 మేనేజ్‌మెంట్‌తో గొడవపెట్టుకుని బిత్తిరి సత్తి రాజీనా

Advertiesment
v6తో గొడవపడి బిత్తిరి సత్తిబాబు రాజీనామా.. ఉదయభానుతో ఆ ఛాన్స్?
, గురువారం, 9 నవంబరు 2017 (11:29 IST)
తీన్‌మార్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియా్స్ రవి.. తాను పనిచేస్తున్న వీ6 ఛానల్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీ6 మేనేజ్‌మెంట్‌తో గొడవపెట్టుకుని బిత్తిరి సత్తి రాజీనామా చేసి బయటికి వచ్చేశాడని టాక్ వస్తోంది. తెలంగాణ యాసతో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే సత్తి అలియాస్ రవి కెరీర్‌ను వీ6లోనే ఆరంభించాడు. కానీ అవకాశాలు పెరగడంతోనే బిత్తిరి సత్తి వీ6 నుంచి గొడవ పడి బయటికి వెళ్ళాడని ఛానల్ యాజమాన్యం అంటోంది. రూ.2 లక్షల నెల వేతనంతో మరో ప్రముఖ చానల్‌లో సత్తికి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. 
 
ఇకపోతే... సత్తికి పాప్యులారిటీ పెరుగుతూ ఉండటంతో, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకోవడానికీ వీ6 మేనేజ్‌మెంట్ అనుమతిచ్చింది. సత్తి ప్రైవేటు షూటింగ్‌లకు కూడా సంస్థ కెమెరాలను తీసుకువెళుతుంటే ఏమీ అనలేదు. ఇక ఇటీవలి కాలంలో అతనికి అవకాశాలు పెరగడంతో వీ6 మేనేజ్‌మెంట్‌ను లెక్కచేయలేదని సమాచారం. అంతేగాకుండా.. ఉదయభాను వంటి టాప్ యాంకర్‌తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో, సత్తి వీ6 మేనేజ్‌మెంట్ గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మావతి, అల్లావుద్దీన్‌‌ల మధ్య శృంగార సన్నివేశాలా?