Publish Date: Mon, 01 Apr 2024 (20:21 IST)
Updated Date: Mon, 01 Apr 2024 (20:25 IST)
అమలా పాల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌లో వుంది. ప్రస్తుతం తన మూడవ త్రైమాసికంలో ఉన్న నటి, ఇటీవల తన భర్త జగత్ దేశాయ్‌తో కలిసి అద్భుతమైన ఫోటోషూట్‌తో వనిత మ్యాగజైన్ కవర్ పేజీని అలంకరించింది. గౌనులో అమల తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అమల తాజా చిత్రం "ది గోట్ లైఫ్" సక్సెస్ తర్వాతా అమలా పాల్ ఈ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలిచింది.