Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమలాపాల్ గర్బవతి అయ్యింది...

Advertiesment
Amala Paul
, గురువారం, 4 జనవరి 2024 (12:03 IST)
Amala Paul
నటి అమలా పాల్ గర్భవతి అయ్యింది. దీంతో నటి అమలా పాల్, జగత్ దేశాయ్‌లకు అభినందనలు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరంలో వారు గుడ్ న్యూస్ చెప్పారు. గత సంవత్సరం నవంబర్‌లో వివాహం చేసుకున్న అమల, జగత్ బీచ్‌లో పోజులిస్తూ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ద్వారా తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. 
 
ఇందులో అమల, ఎరుపు రంగు కో-ఆర్డ్ సెట్‌లో ధరించి, తన బేబీ బంప్‌తో కనిపించింది. తదుపరి స్లైడ్‌లో తమ ముఖాలు చూపకుండా, త్వరలో కాబోయే తల్లిదండ్రులు అమల బేబీ బంప్‌ను చూపిస్తుంది. చిత్రాలను పంచుకుంటూ, అమల ఇలా రాశారు.. "1+1 మీతో 3 అని ఇప్పుడు నాకు తెలుసు.." అంటూ రాసుకొచ్చింది. దీంతో కామెంట్ సెక్షన్ అభినందనలతో నిండిపోతుందని చెప్పనవసరం లేదు.
 
ఈ సందర్భంగా సెలెబ్రిటీలు అమలాపాల్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరిలో కాజల్ అగర్వాల్, చిత్రనిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్, దర్శకురాలు బి వి నందిని రెడ్డి, నటి రేష్మి తదితరులు వున్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసక్తిగా మారిన సంక్రాంతి సినిమాలు - తప్పుకుంటున్న ఇద్దరు హీరోలు?