Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత నిర్ణయం, పొంగిపోతున్న నాగ్ - అమల.. ఏంటది?

మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఆ మాటలను అందాల తార సమంత మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో నిరూపిస్తోంది. చాలామంది తారలు వారికి వచ్చిన డబ్బులో ఎంతో కొంత సమాజ సేవ చేస్తున్నారు. అందులో సమంత మాత్రం చాలా స్పెషల్. తనకు వచ్చిన డబ్బులను అనాధలకు ఇస్తూ వారిని

Advertiesment
సమంత నిర్ణయం, పొంగిపోతున్న నాగ్ - అమల.. ఏంటది?
, బుధవారం, 27 డిశెంబరు 2017 (21:17 IST)
మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఆ మాటలను అందాల తార సమంత మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో నిరూపిస్తోంది. చాలామంది తారలు వారికి వచ్చిన డబ్బులో ఎంతో కొంత సమాజ సేవ చేస్తున్నారు. అందులో సమంత మాత్రం చాలా స్పెషల్. తనకు వచ్చిన డబ్బులను అనాధలకు ఇస్తూ వారిని ఆదుకుంటోంది. అక్కినేని ఫ్యామిలీలో పెద్ద కోడలిగా అడుగు పెట్టిన సమంత కుటుంబంలో మంచి పేరునే కొట్టేసింది. 
 
నాగచైతన్యతో పెళ్లయిన తరువాత సమంత జరుపుకున్న మొదటి పండుగ క్రిస్మస్. ఇది ఆమె తొలి పండుగ. అక్కినేని ఇల్లంతా కూడా క్రిస్మస్ స్టార్స్ పెట్టి ఇంటికి కొత్త కళను వచ్చేలా చేసింది. చైతూ కూడా సమంతకు చేదోడు వాదుడుగా ఉంటూ సహాయం చేశాడు. అయితే అదేరోజు నాగార్జున, అమలతో కలిసి కొద్దిసేపు సమంత మాట్లాడారు. 
 
తన వివాహానికి వచ్చిన విలువైన వస్తువులను అమ్మేసి డబ్బులు చేసుకుందామని చెప్పారట సమంత. ఎందుకిలా చేయాలి అని అమల ప్రశ్నించగా ఆ వస్తువులు మనకి గొప్పవి కావచ్చు. వాటిని అమ్మితే కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దాంతో అనాధలకు సేవ చేద్దాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకుందామని చెప్పిందట. దీంతో నాగార్జున, అమలలు చాలా మంచి ఆలోచన అలాగే చేద్దామంటూ చెప్పారట. త్వరలోనే నాగచైతన్య, సమంతల వివాహానికి సంబంధించిన గిఫ్ట్‌లను విక్రయించనున్నారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిల్ రాజు వెంటపడ్డ అనుపమ.. ఎందుకు?