తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకులతో ఏ హీరో అయినా మరో సినిమా చేయడానికి సిద్శమతారు. ఒక్కోసారి కాస్త ఆలస్యం అవుతుంటుంది. తాజా సమాచారం ప్రకారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`చిత్రంతో అఖిల్‌నూ, తనకూ విజయాన్ని ఇచ్చుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మిరిల్లు సినిమా తర్వాత అంతటి సక్సెస్ ఆయన ఇవ్వలేకపోయాడు. ఆరెంజ్ అనే సినిమా తీసి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలంగేప్ తీసుకుని వచ్చాడు. అయితే అప్పట్లోనే అఖిల్‌తో మరో సినిమా అవకాశం వుంటే చేస్తానని ప్రకటించారు.
ఇప్పుడు ఆ మాటలు నిజం చేస్తూ ఓ వార్త బయటకు వచ్చింది. అఖిల్ తాజాగా స్పై థ్రిల్లర్ సినిమాగా `ఏజెంట్` చేస్తున్నాడు. కొంతకాలం దర్శకుడిగా గేప్ తీసుకున్న సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతోంది. ఇందులో అఖిల్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 12న విడుదలకాబోతోంది.
కాగా, అఖిల్‌కు ఇప్పటికే భాస్కర్ ఓ కథను చెప్పడం. అందుకు అంగీకరించడం జరిగిందని తెలుస్తోంది. ఏషియన్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే అఖిల్, భాస్కర్ కలయికలో రెండో మూవీపై క్లారిటీ రానుంది.