ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య.. ఇంటర్నెట్‌లో నెటిజన్లు వార్త రాసేశారు!
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారని ఆదివారం ఇంటర్నెట్‌లో పుకార్లు హల్‌చల్ చేశాయి. కుటుంబ కలహాలతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని.. వదంతుల
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారని ఆదివారం ఇంటర్నెట్‌లో పుకార్లు హల్‌చల్ చేశాయి. కుటుంబ కలహాలతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని.. వదంతులు వ్యాపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
'యే దిల్‌హై ముష్కిల్' చిత్రం ప్రచారంలో భాగంగా ఐశ్వర్య.. రణ్‌బీర్ కపూర్‌తో అత్యంత సన్నిహితంగా పోజులిస్తూ ఫొటోలు దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కుటుంబ సభ్యులకు, ఐశ్వర్యకు మధ్య కలహం ఏర్పడిందని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సైట్లు రాశాయి.
ఈ వార్తలకు సోషల్‌మీడియా ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. అయితే ఆదివారం రాత్రి జరిగిన మనీశ్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకకు ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో పుకార్లు వ్యాపింపజేసిన వారి నోళ్లు మూతపడ్డాయి. సోమవారం తెల్లవారుజాము వరకూ మనీశ్ పార్టీలో ఐశ్వర్య, అభిషేక్ ఆనందంగా గడిపారంటూ పార్టీకి హాజరైనవాళ్లు వార్తాపత్రికలకు స్పష్టంచేశారు. దాంతో పుకార్లకు తెరపడింది.