Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను కట్టాల్సిన బిల్లులు గుర్తుకొచ్చి.. జీరోడిగ్రీ ఉష్ణోగ్రత వద్ద బురద.. నీళ్లలో నటిస్తున్నా : కంగనా రనౌత్

నిజానికి తనకు నటిగా జీవించడం ఏమాత్రం ఇష్టం లేదనీ, కానీ తాను కట్టాల్సిన బిల్లులు గుర్తుకొచ్చి ఇష్టంలేని సన్నివేశాల్లో నటిస్తున్నట్టు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో విభిన్న పాత్రలత

Advertiesment
Kangana Ranaut
, సోమవారం, 5 డిశెంబరు 2016 (15:08 IST)
నిజానికి తనకు నటిగా జీవించడం ఏమాత్రం ఇష్టం లేదనీ, కానీ తాను కట్టాల్సిన బిల్లులు గుర్తుకొచ్చి ఇష్టంలేని సన్నివేశాల్లో నటిస్తున్నట్టు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో విభిన్న పాత్రలతో తనకంటూ గుర్తింపును తెచ్చుకొని బాలీవుడ్‌ క్వీన్‌గా ఎదిగింది కంగనా రనౌత్‌. మహిళా ప్రాధాన్య చిత్రాల్లో తన నటనకుగానూ అవార్డులను.. ప్రశంసలను అందుకుంది. కానీ ఈ అమ్మడికి నటిగా ఈ జీవితం నచ్చడం లేదట. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... ''నిజం చెప్పాలంటే నేను చేసే సినిమాల్లోని పాత్రలు.. వాటికి ఎదురయ్యే పరిస్థితులు అస్సలు నచ్చవు. అలాంటి వ్యక్తులను నిజజీవితంలో కలుసుకోవాలని కూడా అనుకోను. అలాగే జీరో డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద బురద.. నీళ్లలో నటించడమన్నా ఇష్టం ఉండదు. కానీ నేను కట్టాల్సిన బిల్లులు గుర్తొచ్చి వాటిల్లో నటిస్తున్నా'' అని చెప్పుకొచ్చింది కంగనా.
 
సినిమాల్లో చేసే పాత్రల ప్రభావం తనమీద ఉంటుందా? అని అడగ్గా.. '' నటులు సన్నివేశాలు సహజత్వం కోసం ఎక్కువగా లీనమై నటిస్తుంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఆ భావోద్వేగాల్లోనే ఉండిపోతుంటారు. దీంతో మానసికంగా దెబ్బతింటారు. కాబట్టి వాటినుంచి వెంటనే బయటపడే ప్రయత్నాలు చేయాలి. 'కట్టిబట్టి' చిత్రంలో కేన్సర్‌ పేషెంట్‌గా నటించినపుడు కూడా అంతే. క్లైమాక్స్‌ సన్నివేశాల్లో నటించినపుడు ఆ పాత్రలో లీనమైపోయి చాలా సెన్సెటివ్‌గా అయిపోయా. ప్రతి చిన్నవిషయానికి ఏడ్చేశా. కానీ నాకు నేనుగానే దాన్నుంచి బయటపడ్డా. దానివల్ల శారీరకంగా.. మానసికంగా ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు.'' అని ఆమె వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లరి నరేష్ పాపకు ఏం పెట్టారో తెలుసా? అయానా ఇవికా.. ట్విట్టర్లో ఫోటో