Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊపేస్తున్న ఆదా శర్మను పట్టించుకోని టాలీవుడ్!

Advertiesment
ఊపేస్తున్న ఆదా శర్మను పట్టించుకోని టాలీవుడ్!
, సోమవారం, 15 మార్చి 2021 (15:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోకి "హార్ట్ ఎటాక్" చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. డేరింగ్ అండ్ డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆదా శర్మకి ఈ సినిమాతో కాస్తో కూస్తో పేరొచ్చినప్పటికీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. 
 
సాధారణంగా అయితే ఇండస్ట్రీకీ పూరి జగన్నాథ్ ఒక హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నాడంటే దర్శక, నిర్మాతలలో.. హీరోలలో ఆసక్తి మామూలుగా ఉండదు. పూరి సినిమా రిలీజ్ కాకుండానే హీరోయిన్ గురించి ఆరా తీసి డేట్స్ లాక్ చేసుకుంటారు. కానీ ఆదా శర్మ విషయంలో సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. తెలుగులో ఎంట్రీ ఇవ్వకముందే బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. కానీ ఆమెకు సరైన్ బ్రేక్ ఇవ్వలేదు. 
 
ఇక 'హార్ట్ ఎటాక్' తర్వాత తెలుగులో 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలలో చిన్న పాత్రలు పోషించింది. ఇవి అదాకి పెద్దగా ఉపయోగపడలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే యంగ్ హీరో అడవి శేష్ నటించిన "క్షణం" సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు. 
 
పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నా కూడా గ్లామర్ క్యారెక్టర్స్‌కి ఒకే చెప్పినా గానీ ఎందుకనో టాలీవుడ్‌లో అదా శర్మ స్టార్ హీరోయిన్‌గా సెటిలవలేకపోయింది. కానీ, సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటోలతో అదరగొడుతుంది. ఈ ఫోటోల ద్వారానే ఈమె పేరు మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `శాకుంత‌లం` ప్రారంభం