Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదా శర్మ అదుర్స్.. గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసా పఠించింది.. (video)

Advertiesment
Adah Sharma
Adah Sharma
గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసాను పఠించింది హీరోయిన్ ఆదాశర్మ. హనుమజ్జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసాను పఠించి అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అలాగే ఆదా శర్మ పక్కన వున్న బాలుడు నోటితో మ్యూజిక్ ఇచ్చాడు. అదే సమయంలో బ్రీత్ లెస్ చాలీసాను హీరోయిన్ ఆదా శర్మ చదవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తమ ప్రయత్నం హనుమంతుడిని మెప్పిస్తుందని భావిస్తున్నట్లు ఆదా శర్మ పేర్కొన్నారు. 
 
కాగా తెలుగులో హార్ట్ అటాక్ సినిమాలో హయాతి పాత్రలో కనిపించిన ఆదా శర్మ.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో నటించింది.
 
ఇటీవల కేరళ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ranbir Kapoor: వీరులు పుట్టకముందే… రామ ఉన్నాడు..