Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్ అర్చనను పడక సుఖం ఇవ్వమని కోరిన టాలీవుడ్ హీరో ఎవరు?

ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఫిల్మ్ నగర్ అంతటా ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. నటి అర్చనకు సినిమా అవకాశం కల్పించినందుకు ప్రతిగా పడక సుఖం ఇవ్వమని అడిగిన ఆ టాలీవు

Advertiesment
Actress Archana Exclusive Interview
, ఆదివారం, 8 జనవరి 2017 (14:47 IST)
ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఫిల్మ్ నగర్ అంతటా ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. నటి అర్చనకు సినిమా అవకాశం కల్పించినందుకు ప్రతిగా పడక సుఖం ఇవ్వమని అడిగిన ఆ టాలీవుడ్ హీరో ఎవరన్న అంశంపై ఇపుడు రకరకాలైన చర్చ సాగుతోంది.
 
నిజానికి వెండితెర వెనుక అనేక విషాద సంఘటనలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే, ఇవి ఇటీవలి కాలంలో బయటపడుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ అర్చన కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు.. షూటింగ్‌ పూర్తయిన తర్వాత.. నీకు అవకాశం ఇచ్చాను.. నాకేమిస్తావ్‌ అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది.
 
వెంటనే.. మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది. ఇక అవార్డుల ఫంక్షన్‌లో ఓ అవార్డు ఇవ్వడానికి ఓ నటుడితో కలిసి వేదిక మీదకు తాను వెళ్లాలని నిర్వాహకులు చెప్పారని, చివరి నిమిషంలో ఆ హీరో తనతో కలిసి వేదిక మీదకు రావడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో హీరోకి తోడుగా మరో హీరోయిన్‌ను పంపించారని తెలిపింది అర్చన. ఇంతకీ ఆ హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
webdunia
 
అయితే, ఇపుడు అర్చన చేసిన ఆరోపణలపై చర్చ సాగుతోంది. ఆమె అవకాశాలు లేక కష్టాల్లో ఉన్నపుడు... సినీ ఛాన్సులిప్పించిన హీరో ఎవరు.. అలాగే, అవార్డుల ఫంక్షన్‌లో ఆమెతో వేదిక పంచుకునేందుకు నిరాకరించిన నటుడు ఎవరన్న అంశంపై ఇపుడు సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్న మెగాస్టార్ కదా అని 'వాడు, వీడు' అంటే సైలెంట్‌గా ఉండాలా?: నాగబాబుపై నెటిజన్ల ఫైర్ (నాగబాబు స్పీచ్ వీడియో)