Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్న మెగాస్టార్ కదా అని 'వాడు, వీడు' అంటే సైలెంట్‌గా ఉండాలా?: నాగబాబుపై నెటిజన్ల ఫైర్ (నాగబాబు స్పీచ్ వీడియో)

గుంటూరు వేదికగా జరిగిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు నాగబాబు ఇద్దరిపై మాటలతూటాలు పేల్చాడు. ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్ కాగా, మరొకరు వివాదాస్పద దర్శక

Advertiesment
Naga Babu
, ఆదివారం, 8 జనవరి 2017 (13:03 IST)
గుంటూరు వేదికగా జరిగిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు నాగబాబు ఇద్దరిపై మాటలతూటాలు పేల్చాడు. ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్ కాగా, మరొకరు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. వీళ్లద్దిరిని వాడు.. వీడు అంటూ సంబోధించాడు. అంతేనా... కుసంస్కారి, అక్కుపక్షి అంటూ ఘాటైన పదజాలాన్ని వాడాడు. 
 
దీనిపై నెటిజన్లతో పాటు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు తమదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాంగోపాల్ వర్మ శ్రుతిమించుతున్నాడని మెగా ఫ్యాన్స్ అంటుంటే, వర్మకు మద్దతుగానూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. తన అన్న మెగాస్టార్ అని చెప్పి, వాడు వీడు అంటుంటే, సైలెంట్‌గా ఉండటానికి రాంగోపాల్ వర్మ వేరెవరి ఫ్యానో కాదని అంటున్నారు. 
 
తనను విమర్శిస్తే స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెబుతున్నారు. ఇక వర్మకు వ్యతిరేకంగానూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. హిట్లు లేని ఆయన జయాపజయాలపై హితబోధలు చేసేదేంటని అంటున్నారు. ట్వీట్ల వేదికగా సాగుతున్న యుద్ధం ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగబాబు ఆవేశంలో అలా అని ఉంటాడు... గురువుగారూ అంటూ ఆప్యాయంగా పలుకరిస్తాడు.. : యండమూరి