Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'టోల్‌ ఫ్రీ నెం.143' షూటింగ్‌ పూర్తి... ఈ నెలలో ఆడియో

Advertiesment
toll free no 143 movie
భాస్కరా గ్రూప్‌ ఆఫ్‌ మీడియా పతాకంపై పోసాని కృష్ణమురళి కీలకపాత్రలో వి.ఎస్‌.వాసు తెరకెక్కిస్తున్న చిత్రం 'టోల్‌ ఫ్రీ నెం.143'. దాసరి భాస్కర్‌ యాదవ్‌ నిర్మాత. క్లబ్బులు, పబ్బులు, రేవ్‌ పార్టీలు అంటూ నటితరం యువత తమ జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకొంటున్నాయో ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు దర్శకుడు వి.ఎస్‌.వాసు. 
 
చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌లో విడుదల చేసి, అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దాసరి భాస్కర్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 'నేటి యువత చెడు దారులు పడుతూ.. ఏ విధంగా తమ కెరీర్‌ను నాశనం చేసుకొంటున్నారో చూపించనున్నాం.. వారిని సక్రమమైన మార్గంలో నడిపించే వ్యక్తిగా పోసాని చాలా మంచి పాత్రలో కనిపించనున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అన్నారు.
 
చిత్ర దర్శకుడు వి.ఎస్‌.వాసు మాట్లాడుతూ... ''టోల్‌ ఫ్రీ నెం.143' చిత్రీకరణ పూర్తయింది. మా నిర్మాత దాసరి భాస్కర్‌ యాదవ్‌గారి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. పోసాని కృష్ణమురళిగారి క్యారెక్టర్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే.. కృష్ణభగవాన్‌, సుమన్‌శెట్టి, ధనరాజ్‌, రోలర్‌ రఘు, చమ్మక్‌ చంద్ర వంటి కమెడియన్లు ఆద్యంతం నవ్విస్తారు' అన్నారు!

Share this Story:

Follow Webdunia telugu