Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అపరిచితుడు విక్రమ్‌ని టార్చర్ పెడుతున్న డైరెక్టర్ శంకర్!

Advertiesment
Tollywood
అపరిచితుడు, మల్లన్న వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన తమిళ స్టార్ విక్రమ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో "ఐ" (తెలుగులో మనోహరుడు) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ సినిమాను శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ విషయంలో విక్రమ్‌కి టార్చర్ పెడుతున్నాడట.

ఈ సినిమా కోసం విక్రమ్‌ను డైటింగ్ చేయాలని శంకర్ ఆర్డరేశాడట. విక్రమ్ లుక్ కోసం అమెరికా నుంచి స్పెషల్‌గా మేకప్ ఆర్టిస్టులను రప్పించడమే కాకుండా రోజుకు రెండు లక్షలు వారి పై ఖర్చు పెట్టిoచాడట శంకర్. షూటింగ్ రోజులలో తెల్లవారుజామున మొదలయ్యే మేకప్ మధ్యలో విక్రమ్ నిద్రపోతే వేసిన స్పెషల్ మేకప్ పాడై పోతుందని విక్రమ్‌ను నిద్ర పోకుండా చూడ్డానికి మనుషులను కూడా కేటాయించాడట శంకర్. అందుకే శంకర్ పేరు చెపితే చాలు ఇపుడు విక్రమ్ బెదిరిపోతున్నాడట.

Share this Story:

Follow Webdunia telugu