Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ కు ఆడవారి గండం: ష‌ర్మిల

Advertiesment
కేసీఆర్ కు ఆడవారి గండం: ష‌ర్మిల
, శనివారం, 13 నవంబరు 2021 (18:27 IST)
రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రిధాన్యం కొన‌బోమ‌ని చెబుతున్న నేప‌థ్యంలో రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు వైయ‌స్ తెలంగాణ పార్టీ ఆధ్వ‌ర్యంలో పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల ధర్నా చౌక్, ఇందిరా పార్క్ హైదరాబాద్ వ‌ద్ద "రైతు వేద‌న" నిరాహార దీక్ష శనివారం జరిగింది.


సాయంత్రం 5.40 నిమిషాలకు నిరాహార దీక్ష ముగింకుని వైయస్ షర్మిల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  "శుక్రవారం నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. కానీ ధర్నా చౌక్ వద్ద వైయ‌స్ తెలంగాణ పార్టీకి అనుమతి ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. దీంతో శనివారం నుంచి నిరాహార దీక్ష మొదలు పెట్టాం. 72 గంటల రైతు వేదన నిరాహార దీక్షకు ధర్నా చౌక్ వద్ద సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో లోటస్ పాండ్ లో మిగిలిన 48 గంటల రైతు వేదన నిరాహార దీక్ష చేయాలనుకున్నా అక్కడ కూడా పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. స్టేజ్ వేయనివ్వడం లేదు. వేసినా తీసేస్తున్నారు.

 
ఆఖరి గింజ వరకు వడ్లు కొంటానన్న కేసీఆర్ మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరో మూడు వారాలు వరి పంట కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కు సమయం ఇస్తున్నాం. లేదంటే నిరాహార దీక్షకు కాదు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికైనా సిద్ధం.

 
మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. నన్ను చూస్తుంటే కేసీఆర్ కు ఎందుకు అంత ఉలికిపాటు..? కేసీఆర్ కు ఆడ వారి గండం ఉందట. ఇప్పుడు మమ్మల్ని చూసి భయపడటం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తెలంగాణలో పోలీసుల జులూం నడుస్తోంది. పాలన చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ కు వరి కొనడం చేత కాలేదు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు మాటలు చెప్పే మొనగాళ్లే కాని పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు కారు. పరిపాలన చేత కాక ధర్నాలు చేస్తుంది అధికార పక్షం.

 
కేసీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వడం కూడా చేత కాలేదు, రుణమాఫీ చేయడం చేత కాలేదు, ఇంటికో ఉద్యోగం చేత కాలేదు, నిరుద్యోగభృతి కూడా ఇవ్వడం చేత కాలేదు, కేజీ టూ పీజీ విద్య ఇవ్వడం చేతకాలేదు హామీలను కూడా నిలబెట్టుకోలేని కేసీఆర్ వాటిపై కూడా ధర్నా చౌక్ కు వచ్చి ధర్నాలు చేయాలి...? లేకపోతే రాజీనామా చేసి ఒక దళితున్ని ముఖ్యమంత్రిని చేయండి. రైతుల గురించి కేసీఆర్ ఆలోచన చేయడం లేదు. లక్షల ఎకరాల్లో వరి వేసిన రైతులు ఏమైపోతారో అని కనీస ఆలోచన చేయడం లేదు.

 
రైతుల పక్షాన పోరాడుతుంటే మమ్మల్ని కూడా ఆపాలని చూస్తున్నారు. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు. నన్ను ఆపడం కేసీఆర్ తరం కాదు. హుజురాబాద్ లో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. నిరుద్యోగులు, రైతులు, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను తరిమికొట్టే సమయం దగ్గర పడింది. 3వారాలు కేసీఆర్ కు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత షర్మిలమ్మను ఆపడం ఎవరి తరం కాదు. మా పోరాటం ఇంకా ఉదృతం చేస్తాం. ఆమరన నిరాహార దీక్ష వరకు ఈ పోరాటం ఆగదు.

 
కేసీఆర్ ఆకరి గింజ వరకు వరి కొనుగోలు చేయాలి. కేసీఆర్ మెడలు వంచి ఆకరి గింజ కొనేంత వరకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఆగదని హెచ్చరిస్తున్నాం. ఇది వైయ‌స్ రక్తం" అని నిప్పులు చెరిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2100 నాటికి భూమిపై భయంకరమైన మార్పులు.. ఏంటవి?