తెలంగాణలోనూ పవన్‌ తోనే: బీజేపీ

మంగళవారం, 28 జనవరి 2020 (07:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు.

హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ…. అన్ని రాష్ట్రాల్లో పవన్‌ సేవలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో భేటీ అవుతామన్నారు.

జనసేన-బీజేపీ కలిసి సీఎం కేసీఆర్‌ అవినీతి కుటుంబ పాలనను దించుతామని ఆయన హెచ్చరించారు. మెజారిటీ లేని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ దొడ్డిదారిన ఛైర్మన్‌ పదవి చేజిక్కించుకుందని ఆరోపించారు.

100 సీట్లు గెలిచినా టీఆర్‌ఎస్‌కు తృప్తి లేదని, బీజేపీ గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ఇలా చేయడం సరికాదన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నేను చాలా సార్లు కట్టుబాట్లను ధిక్కరించా: సన్నీలియోన్