Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

ఎవ‌రీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్?

టి.ఆర్.ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ పేరును ఖ‌రారు చేసింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అంత‌గా వార్త‌ల్లో లేని బ‌డుగుల లింగ‌య్య ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిల‌వ‌డంతో... లింగ‌య్య ఎవ‌రు అని ఆరా తీయ‌డం మొద‌లెట్టారు. ఇంత‌కీ.. లింగ‌య్య ఎవ‌ర

Advertiesment
Who is Badugula Lingaiah Yadav
, ఆదివారం, 11 మార్చి 2018 (19:32 IST)
టి.ఆర్.ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ పేరును ఖ‌రారు చేసింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అంత‌గా వార్త‌ల్లో లేని బ‌డుగుల లింగ‌య్య ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిల‌వ‌డంతో... లింగ‌య్య ఎవ‌రు అని ఆరా తీయ‌డం మొద‌లెట్టారు. ఇంత‌కీ.. లింగ‌య్య ఎవ‌రంటే... 
నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత బడుగుల లింగయ్య యాదవ్ సుదీర్ఘ కాలం పాటు టిడిపిలో సేవలందించారు.
 
టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో బడుగుల లింగయ్య యాదవ్ 2015 మార్చి 13వ తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కేతేపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన బడుగుల లింగయ్య, టీడీపీ స్థాపించిన 1982 నుంచి పార్టీలో కొనసాగారు. పదేండ్ల పాటు పార్టీ మండలశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 
 
ఆ త‌ర్వాత పదకొండు ఏళ్ల పాటు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. బీమారం గ్రామంలో ఎంపిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసి ప్రస్తుత శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ మీద ఓడిపోయారు. 2015 మార్చి 16వ తేదీన బడుగల టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బ‌డుగుల రాజ‌కీయ అనుభ‌వం, పార్టీ ప‌ట్ల విధేయుడుగా ఉండ‌టం గ‌మ‌నించిన కెసిఆర్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఖరారు చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచకావ్యం పేరుతో నంది బ్రాండ్ సేంద్రీయ ఎరువులు