హైదరాబాద్ లోని నెహ్రూ జూలో 14 ఏళ్ల తెల్ల పులి(బద్రి) శుక్రవారం చనిపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రి.. శుక్రవారం ఉదయం చికిత్స పొందూతూ చనిపోయిందని జూ అధికారులు తెలిపారు.
ఈ నెల 7 న పులి మెడకు వాపు కనిపించినప్పటి నుంచి వెటర్నరీ డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించారు. మూడ్రోజుల నుంచి పులి ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్లు పులి మెడ భాగం నుంచి 5 కిలోల కణితిని బయటికి తీశారు.
పులి శరీరం నుంచి శాంపి ల్స్ సేకరించి హైదరాబాద్ శాం తినగర్ లోని బయోలజికల్ ఇన్ స్టిట్యూట్ కు పంపినట్లు అధికారులు చెప్పా రు. రాజేంద్రనగర్ వెటర్న రీ కాలేజీ డాక్ట ర్లు , అత్తా పూర్ లోని సీసీఎంబీ అధికారులు పులి మరణానికి కారణాలేంటో ఇన్వెస్టిగేట్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఏపీలోని తిరుపతి జూ లో 2006లో జన్మించిన బద్రిని.. కొన్నే ళ్ల కిందట హైదరాబాద్ లోని నెహ్రూ జూకు తీసుకువచ్చారు.