Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రతా మండలిలో పాక్ కు చుక్కెదురు...చైనా మినహా మిగతా దేశాలన్నీఇండియాకే మద్దతు

Advertiesment
భద్రతా మండలిలో పాక్ కు చుక్కెదురు...చైనా మినహా మిగతా దేశాలన్నీఇండియాకే మద్దతు
, శనివారం, 17 ఆగస్టు 2019 (12:35 IST)
జమ్మూ కాశ్మీర్​ అంశం ఆ రెండు(ఇండియా, పాక్) దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పిం ది. శుక్రవారం కశ్మీర్ అంశంపై73 నిమిషాల పాటు జరిగిన క్లోజ్డ్​డోర్​మీటింగ్ లో ఇండియాను రష్యా వెనకేసుకువచ్చింది.

కశ్మీర్​లో పరిస్థితి ఆందోళనకరంగాఉందన్న చైనా వాదనను కొట్టిపారేసింది.ఆర్టికల్​370 రద్దును రష్యా స్వాగతించిం ది.ఈ రహస్య సమావేశంలో పాకిస్తాన్ కు చైనా అండగా నిలబడగా.. శాశ్వత సభ్యత్వం ఉన్నరష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ప్రతినిధులు ఇండియాకు మద్దతు తెలిపాయి.

మీటింగ్ర్వాత యూఎన్ లో ఇండియా ప్రతినిధిసయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాశ్మీర్​అంశం పూర్తిగా ఇండియా అంతర్గత వ్యవహా-రమన్నారు. ఇందులో పాక్​ సహా ఏదేశమూజోక్యం చేసుకోలేదన్నారు.

రోగం వచ్చాకడాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కన్నా, ముందే జాగ్రత్త పడడం మేలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసు-కున్నట్లు వివరిం చారు. 1972 ఒప్పం దంతోసహా కుదుర్చుకున్న అన్ని ఒప్పం దాలనూ ఇండియా గౌరవిస్తుందని, ఏ ఒప్పం దాన్నీ మీరలేదని వివరించారు. ఓవైపు టెర్రరిస్టులనుప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలంటే ఒప్పుకునేది లేదని పాకిస్తాన్ కు తేల్చిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ మరో కర్ణాటక: టీఆర్ఎస్ నేతల్లో గుబులు