మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ పెద్దలు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది లక్ష్మణ్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏముంది ప్రశ్నించారు.
భాజపాలోకి తెదేపా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి
వలసలతో రాష్ట్రంలో బలపడేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ... ప్రయత్నాలు వేగవంతం చేసింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి... మాజీ మంత్రి శనక్కాయల అరుణ, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి సహా పలువురు నేతలను చేర్చుకుంది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి... మాజీ మంత్రి శనక్కాయల అరుణ, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి సహా పలువురునేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఇప్పటికే దిల్లీ చేరుకున్న నేతలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిశారు. సాయంత్రం వీరంతా జపా కార్యనిర్వాక అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.