Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యత్నాలు

Advertiesment
ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యత్నాలు
, శుక్రవారం, 31 డిశెంబరు 2021 (07:42 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ప్రయాణికులను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. బస్సులు, బస్టాండుల్లో ఆకస్మిక ప్రయాణాలు చేస్తూ, ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ, ముచ్చటిన్నారు.
 
 అలాగే, వివాహాది శుభకార్యాలయాలకు బస్సును బుక్ చేసుకుంటే ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల సీజన్ కావడంతో ప్రయాణికులపై అదనపు భారం మోపలేదు. సంక్రాంతి కోసం నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయరాదని ఆయన అధికారులను ఆదేశించారు. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఆయన ఒక విజ్ఞప్తి చేసి, సంక్రాంతి తక్కువ ధరలోనే ప్రయాణం చేయాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉడతకు మరణశిక్ష విధించిన బ్రిటన్ - ఎందుకో తెలుసా?