Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణేలను తీసుకోవాల్సిందే

Advertiesment
sajjanar
10 rupees coins
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణెం సమస్యకు చెక్ పెట్టినట్లైంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దగ్గర పది రూపాయల నాణేలను కండక్టర్లు తీసుకోవట్లేదు. ప్రయాణికుల నుంచి టిక్కెట్ కోసం పది రూపాయల నాణేలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.
 
దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులు ఎలాంటి డౌట్ లేకుండా రూ.10 నాణాన్ని ఆర్టీసీ బస్సులో వినియోగించుకోవచ్చని ప్రకటించారు.
 
టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లకు తెలియజేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులకు ఆదేశించారు. సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాదాద్రిలో బాలయ్య : సీఎం కేసీఆర్‌పై వరాల జల్లు