Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రామప్ప దర్శన్ పేరుతో స్పెషల్ బస్సులు

Advertiesment
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రామప్ప దర్శన్ పేరుతో స్పెషల్ బస్సులు
, శుక్రవారం, 18 మార్చి 2022 (11:59 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్టీసీ ఇపుడు రామప్ప దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
ప్రభుత్వ సెలవుదినాలు, ప్రతి రెండో శనివారాల్లో ఆర్టీసీ బస్సులు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతుందని ఆయన వెల్లడించారు. ఈ సర్వీసు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరుతుందన్నారు. 
 
ఈ సదుపాయాలను ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం 99592 26048 అనే మొబైల్ నంబరుకు  ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన చంద్రబాబు : మమతా బెనర్జీ ఆరోపణ