తెలంగాణలో చౌక ధరకే మొబైల్ ఫోన్లు: ఐదు శాతానికి వ్యాట్ తగ్గింపు!
ఇప్పటికే రూ.250కి మొబైల్ ఫోన్లంటూ రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రిజిస్టర్ చేయించుకున్న వినియోగదారులకు ఫోన్లను డెలివరీ చేసే పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చౌకధ
ఇప్పటికే రూ.250కి మొబైల్ ఫోన్లంటూ రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రిజిస్టర్ చేయించుకున్న వినియోగదారులకు ఫోన్లను డెలివరీ చేసే పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చౌకధరకే మొబైల్ ఫోన్లు దొరకనున్నాయి. తెలంగాణ వ్యాట్ చట్టం-2005లో షెడ్యూలు నాలుగులోకి మొబైల్ ఫోన్లను తీసుకువస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (వాణిజ్యపన్నులు) అజయ్ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సెల్ ఫోన్లపై వ్యాట్‌ను ఐదు శాతానికి తగ్గిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన వ్యాట్ ప్రకారం ఇప్పటిదాకా మొబైల్ ఫోన్లపై 14.5 శాతం పన్ను వసూలు చేస్తుండగా.. అది కాస్త ఐదు శాతానికి తగ్గంచారు. ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు మొబైల్ ఫోన్లపై ఐదు శాతం పన్ను వసూలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అధిక పన్ను అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వ్యాట్‌ను తగ్గించారు.