నా కోరిక తీరిస్తే 100కి 100 మార్కులు వేస్తా... ఏమంటావ్...?
రాజమండ్రి : అతడో కళాశాల కరస్పాడెంట్. విద్యార్థులకు గురువంతటి వాడు. అయితే తనపై ఉన్న ''గురు''తర బాధ్యతను మరిచి కీచకుడిగా మారాడు. నయానో, భయానో విద్యార్థినులను లొంగదీసుకుంటున్న అతడు, తన కాలేజిలో చదువుతున్న అమ్మాయిలు పరీక్షల్లో ఫెయిలైతే అంతేసంగతులు,
రాజమండ్రి : అతడో కళాశాల కరస్పాడెంట్. విద్యార్థులకు గురువంతటి వాడు. అయితే తనపై ఉన్న ''గురు''తర బాధ్యతను మరిచి కీచకుడిగా మారాడు. నయానో, భయానో విద్యార్థినులను లొంగదీసుకుంటున్న అతడు, తన కాలేజిలో చదువుతున్న అమ్మాయిలు పరీక్షల్లో ఫెయిలైతే అంతేసంగతులు, వారిని పిలిపించి తనకు సుఖం అందిస్తే చాలు, నూటికి నూరు మార్కులు వేయిస్తానని చెప్పేవాడు.
రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌లో చాలాకాలంగా గుత్తుల శ్రీధర్ చైతన్య కరస్పాడెంట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. తన ఇనిస్టిట్యూట్‌లో చదువుకునే కుటుంబ పరిస్థితులు సరిగాలేని, ఆర్థికంగా వెనకపడిన అమ్మాయిలను గురిచూసి కొట్టేవాడు. శ్రీధర్ పలువురు యువతులతో తన రూమ్‌లోనే శృంగార లీలలు కొనసాగించి వాటిని సీక్రెట్ కెమెరాలతో వీడియోగా తీస్తూ ఆనందిస్తాడట. తాజాగా ఓ విద్యార్థినితో జరిపిన లైంగిక క్రీడ శ్రీధర్ తీసిన వీడియో ఓ విద్యార్థి చేతికి చిక్కడంతో అతడి అసలు గుట్టు బయటపడింది. దీంతో అతని పాపం పండింది. పోలీసులకు చిక్కాడు.