హైదరాబాద్ పాలకమండలికి ఈరోజు చివరి రోజు కావడంతో రేపు ఉదయం 11:00 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లను బల్దియా పూర్తి చేసింది.
రేపు ముహూర్తం బాగో లేకపోవడంతో ప్రమాణ స్వీకారానికి కార్పొరేటర్లు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. 11:30 గంటలకు అమావాస్య గడియలు దాటిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు వెల్లడించారు.
10 నిమిషాల్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.
మేయర్ రేసులో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, పీజేఆర్ కూతురు విజయ రెడ్డి, తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఉన్నారు. అయితే డిప్యూటీ మేయర్ రేసులో హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, బాబా ఫసియుద్దిన్ పోటీ పడుతున్నారు.