కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ఓ మూర్ఖపు ఆలోచన అని, దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొట్లాడి, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలోని నీటిని ఎట్లా దానం చేస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలన్న ఆలోచనను తాము ఒప్పుకోబోమన్నారు. రాష్ట్రంలోని నీటి వనరులను రాయలసీమకు తరలిస్తే ఊరుకునేది లేదని, నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయ డ్రామా, అవినీతిపై మరో పోరాటం చేస్తామన్నారు.
నాగార్జునసాగర్‌కు పర్యాటకుల తాకిడి
సోమవారం నాగార్జున సాగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలు.. పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు.. పిడుగురాళ్ల, అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే వైపు మళ్లించారు. నాగార్జున సాగర్ మీదుగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన చేశారు.