Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమ్మక్క-సారక్క జాతరకు కేంద్రం రూ. 2.5 కోట్లు

సమ్మక్క-సారక్క జాతరకు కేంద్రం రూ. 2.5 కోట్లు
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:48 IST)
తెలంగాణలో జరిగే ఏ కార్యక్రమం లేదా పండుగ అయినా భాజపా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందనే చెప్పవచ్చు. దానికి ఉదాహరణే సమ్మక్క-సారక్క జాతర నిర్వహణకు కేంద్రం భారీ నిధులను విడుదల చేయీలని నిర్ణయించడం. తెలంగాణ లోని ములుగు జిల్లాలో ఫిబ్రవరి 16-19 తేదీల్లో నిర్వహించే మేడారం సమ్మక్క సారక్క జాతర నిర్వహణకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి రూ.2.5 కోట్లు ప్రకటించారు.

 
గిరిజన సర్క్యూట్ (ములుగు-లక్నవరం-మేడవరం-తాడ్వాయి-దామరవి-మల్లూరు-బోగత)లో 'స్వదేశ్ దర్శన్ స్కీమ్' కింద టూరిజం అభివృద్ధికి 2016-17లో కేంద్ర పర్యాటక శాఖ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. '

 
రాష్ట్రంలో వివిధ పండుగల వేడుకల కోసం 2014 నుంచి మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ ఇన్‌క్లూడింగ్ హాస్పిటాలిటీ (డీపీపీహెచ్) పథకం కింద రూ.2.45 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఆ నిధులతో మేడారంలోని చీకలాల గుట్ట చుట్టూ 500 మీటర్ల కాంపౌండ్‌వాల్‌, 900 మీటర్ల కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారు.

 
ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధులు రామ్‌జీ గోండ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ వంటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మరెందరో వారి సేవలను గుర్తిస్తూ, దేశవ్యాప్తంగా స్థాపించబడిన పది మ్యూజియాల్లో రెండు మ్యూజియంలు తెలుగు రాష్ట్రాలలో రానున్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎండమిక్.. ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే కబురు