శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లను జారీచేసింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేసేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి జారీ చేసే ఈ టోకన్లను తీసుకున్నవారికి బుధవారం నుంచి దర్శనం కల్పిస్తారు.
అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి, సత్రాల వద్ద టోకెన్లను జారీచేస్తారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా పడుతున్నారు.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని నెలలుగా ఉచిత దర్శనం నిలపివేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను జారీ చేస్తూ, వాటిని తీసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తూ వచ్చారు. ఇకపై, సాధారణ భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే చర్యలు తీసుకుంది.