Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో విషాదం: ఫోన్‌లో గేమ్స్ ఆడకూడదనేసరికి?

Advertiesment
హైదరాబాద్‌లో విషాదం: ఫోన్‌లో గేమ్స్ ఆడకూడదనేసరికి?
, సోమవారం, 4 అక్టోబరు 2021 (12:10 IST)
హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ లో ఆడొద్దన్నందుకు ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. హైదరాబాద్‌ మీర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్వోదయ నగర్‌‌కు చెందిన 17 సంవత్సరాల ఓ బాలిక తరచు మొబైల్‌ ఫోన్‌‌లో గేమ్స్‌ ఆడుతూ ఉండేది.
 
అర్థరాత్రి అయినా… మొబైల్‌ ఫోన్‌‌లో గేమ్స్‌ ఆడుతూ ఉండేది. అయితే నిన్నరాత్రి ఆ బాలిక తండ్రి మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడకూడదని ఆ బాలికను మందలించాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. 
 
అందరూ పడుకున్న తర్వాత.. ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ బాలిక. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అటు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు ఆ బాలిక మృతదేహాన్ని తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"