Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మునుగోడు ఉప పోరు ఓట్ల లెక్కింపు : తొలి రౌండ్‌లో తెరాసదే ఆధిక్యం

munugode bypoll vote count
, ఆదివారం, 6 నవంబరు 2022 (09:48 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల మూడో తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరుగగా ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో అధికార తెరాస దూసుకెళుతోంది. పోస్టల్ బ్యాలెట్రలో నాలుగు ఓట్ల ఆధిక్యంలో నిలిచిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. తొలి రౌండ్‌లోనూ ఆధిక్యంలో నిలిచారు. 
 
మొదటి రౌండ్‌లో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కించారు. ఇందులో తెరాసకు 6478 ఓట్లు రాగా, బీజేపీకి 5126, కాంగ్రెస్ పార్టీకి 2100 ఓట్లు వచ్చాయి. దీంతో తన సమీప అభ్యర్థి కంటే తెరాస అభ్యర్థి కూసుకుంట్లకు 1356 ఓట్లు  (పోస్టల్ ఓట్లతో కలిసిపి) ఆధిక్యంలో సంపాదించారు. 
 
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు .. 
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రను కల్పించారు. దీంతో అన్ని పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. 
 
ఈ ఓట్ల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లలో ప్రదర్శిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుమంది. 
 
తుది ఫలితాన్ని 3 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకే పూర్తికానుంది. కాగా, ఈ నెల 3వ తేదీన జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొత్తం 241805 ఓట్లకుగాను 225192 ఓట్లు పోలయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనుచరులు