Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం

Advertiesment
kgtopg university
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా, ఈ తరహా యూనివర్శిటీని తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేశారు. 
 
రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థిని నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దీన్ని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మించారు. 
 
ఈ యూనివర్శిటీ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో తొలి కేజీ టు పీజీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయానికి సంబంధించిన ఫోటోలను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సతీష్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేసి వైఎస్. షర్మిల