Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ బడ్జెట్ రూ.1,49,646... పుట్టిన బిడ్డకు 'కేసీఆర్ కిట్'

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఇందులో కేసీఆర్ పేరుతో ఓ సరికొత్త పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఈ పథకం పేరు కేసీఆర్ కిట్. పుట్టిన ప్

తెలంగాణ బడ్జెట్ రూ.1,49,646... పుట్టిన బిడ్డకు 'కేసీఆర్ కిట్'
, సోమవారం, 13 మార్చి 2017 (16:52 IST)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఇందులో కేసీఆర్ పేరుతో ఓ సరికొత్త పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఈ పథకం పేరు కేసీఆర్ కిట్. పుట్టిన ప్రతి బిడ్డకు 16 సరకులతో కూడిన కిట్‌ను ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 
 
మహిళా శిశు సంక్షేమానికి మొత్తం రూ.731.50 కోట్లు కేటాయించారు. గర్భిణీ స్త్రీలకు మూడు విడతల్లో రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం కోసం చేరిన వెంటనే గర్భిణీ స్త్రీలకు రూ.4 వేలు, డిశ్చార్జి అయ్యాక మరో రూ.4 వేలు, పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోవడానికి వచ్చినప్పుడు మరో రూ.4 వేలు అందించాలని నిర్ణయించామన్నారు. ఆడపిల్లను ప్రసవిస్తే అదనంగా మరో వెయ్యి రూపాయాలు ఇస్తామని ప్రకటించారు. 
 
ఇక పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్‌ను ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కిట్ నవజాత శిశువులకు మూడు నెలల వరకు ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. కిట్‌లో తల్లిబిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్, చిన్న పిల్లల పరుపు, దోమతెర, డ్రస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగు, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులుంటాయి. కేసీఆర్ కిట్ కోసం రూ.605 కోట్లు కేటాయించామని చెప్పారు.
 
రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.1,49,646 కోట్లు
ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు 
గతేడాది వాహనాల పన్ను ఆదాయం రూ.2899 కోట్ల అంచనా
గతేడాది వాహనాల పన్ను రూపంలో వసూలైన ఆదాయం రూ.2,585 కోట్లు
ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయ లక్ష్యం రూ.3000 కోట్లు
ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం అంచనా రూ.36,237 కోట్లు
ఇతర మార్గాల్లో సమకూర్చుకోనున్న కొత్త అప్పులు రూ.26,400 కోట్లు
కేంద్రప్రభుత్వ రుణరూపంలో రూ.1000 కోట్లు
తలసరి అప్పు రూ.40,149 కోట్లు
మొత్తం రాష్ట్ర అప్పు రూ.1,40,523 కోట్లు
2016-17లో రాష్ట్ర అప్పు రూ.1,14,813 కోట్లు
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ మనుషులు మన చుట్టూ తిరుగుతున్నారట.. ఎందుకు..?