ప్రధాని మోడీ మనుషులు మన చుట్టూ తిరుగుతున్నారట.. ఎందుకు..?
భారత్ ఉన్న పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లను మీరు గుర్తించగలరా..? పాకిస్థాన్‌లోని మన రా ఏజెంట్లను అక్కడి ప్రజలు గుర్తించగలరా..? చైనాలోనో.. రష్యాలోనో.. భారత్‌లోనో సైలెంటుగా తమ పని తాము చేసుకుంటూనే అమెరికా ప్
భారత్ ఉన్న పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లను మీరు గుర్తించగలరా..? పాకిస్థాన్‌లోని మన రా ఏజెంట్లను అక్కడి ప్రజలు గుర్తించగలరా..? చైనాలోనో.. రష్యాలోనో.. భారత్‌లోనో సైలెంటుగా తమ పని తాము చేసుకుంటూనే అమెరికా ప్రభుత్వానికి అన్ని సంగతులూ ఉప్పందించే అమెరికా నిఘా ఏజెంట్లను గుర్తుపట్టగలరా..? అస్సలు గుర్తు పట్టలేం.
ఇప్పుడు ఇండియాలోనూ ప్రధాని మోడీ ఏజెంట్లు (వద్దులెండి వాళ్లు వింటే తంటా.. మోడీ టీం అందాం) అడుగడుగునా ఉన్నారట. అయితే.. వీరేమీ మనకు హాని చేయరు. వీరు చేసేదంతా ప్రజల పల్స్ పక్కాగా పట్టుకుని తమ పైలెవల్స్‌కు చేరవేయడమే. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మోడీ వరకు వెళ్తుంది. సో.. ఇండియాలో ఈచ్ అండ్ ఎవ్వెరీ పాయింట్ నుంచి మైక్రో లెవల్లో ప్రజల మైండ్‌సెట్.. వారి అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మోడీకి చేరుతున్నాయట.
పైకి కనిపించని అతి పెద్ద వ్యవస్థ ఒకటి ఇప్పుడు ఇండియాలో పనిచేస్తున్నదని అనుకుంటున్నారు. ఈ కారణంగానే మోడీ అంతగా జనం నాడి పట్టుకోగలుగుతున్నారని.. అందుకే తన నిర్ణయాలను అంత పకడ్బందీగా అమలు చేయగలుగుతున్నారని భావిస్తున్నారు. నిజానికి పెద్ద నోట్ల రద్దు వల్ల జనం ఏమనుకుంటున్నారన్నది ఎవరూ అంచనా వేయలేకపోయారు. రాజకీయాల్లో మునిగితేలే తలలు పండిన నేతలు కానీ.. విశ్లేషకులు కానీ.. మీడియా కానీ సరిగా అంచనా వేయలేకపోయింది. అది మోడీకి నష్టం కలిగిస్తుందనే అనుకున్నారు. కానీ.. మోడీ మాత్రం ఎంతో ధీమాగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ధీమాయే ప్రతిఫలించింది. ఆ ప్రభావం ఏమాత్రం పడలేదు. యూపీలో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తోంది. నిజానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉంటే అది యూపీ వంటి రాష్ట్రంలో కచ్చితంగా కనిపించాలి.
పెద్ద రాష్ట్రం కావడం... అన్ని రకాల ప్రజలు ఉండడం.. ఉద్యోగులు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు.. కూలీలు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్న వారు.. ఎక్కడెక్కడికో వెళ్లి పనులు చేసుకుంటున్నవారు.. దొంగలు - దొరలు... రౌడీలు - అమాయకులు - మేధావులు.. అక్షరం ముక్క రానివారు అంతా యూపీలో ఉన్నారు. అలాంటిచోట ఖచ్చితంగా అన్ని వర్గాలూ పెద్ద నోట్ల రద్దు ప్రభావానికి గురయ్యారు. కానీ.. వారేమీ మోడీని వ్యతిరేకించలేదని ఇప్పుడు అర్థమవుతోంది. వారు వ్యతిరేకిస్తున్నారా? లేదా అన్నది ఇంతవరకు ఎవరూ ఇతమిద్ధంగా చెప్పలేకపోయినా మోడీ మాత్రం నమ్మకంగా ఉండటానికి కారణం ఆయన వద్ద జనం నాడికి చెందిన మొత్తం రిపోర్టు ఉండటమేనట. అందుకే.... ఆయన ఎన్నికల సభల్లోనూ పెద్దగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.
పెద్ద నోట్ల రద్దు వల్ల మీరంతా ఇబ్బంది పడ్డారంటూ క్షమాపణలు చెప్పడం కానీ బుజ్జగించడం కానీ చేయలేదు. అంతాగా కాన్ఫిడెంటుగా ఉన్నారాయన.
అదేకాదు.. ముస్లిం ఓట్లన్నీ బీఎస్పీకే పడతాయని.. మాయవతి మళ్లీ గెలవడం ఖాయమని కొందరు.. గెలవకపోయినా కింగ్ మేకర్ అవుతారని కొందరు అంచనాలు వేశారు. చివరకు బీఎస్పీకి బద్ధ శత్రువైన సమాజ్‌వాది పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్ కూడా అదే నమ్మారు. బీఎస్పీతో కలవడానికి కూడా ఆయన సిద్ధమైపోయారు. కానీ.. మోడీ మాత్రం నింపాదిగా ఉన్నారు. ముస్లింలు ఎవరికి ఓటేస్తున్నారు.. వారి ఓట్లు పడకపోయినా.. అంతకంటే భారీగా తమకు ఎవరి ఓట్లు పడబోతున్నాయన్నది కూడా ఆయనకు తెలిసిందంటే అందుకు కారణం ఈ ఏజెంట్ నెట్ వర్కేనని తెలుస్తోంది. కేవలం యూపీ ఎన్నికల విషయంలోనే కాదు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి తమ ప్రభుత్వాలు కానీ తమ మిత్రపక్షాల ప్రభుత్వాలు కానీ విపక్ష ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి.. ఎంత అవినీతి చేస్తున్నాయి... ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కూడా మోడీ వద్ద పూర్తి రిపోర్టులు ఉంటున్నాయని టాక్.
ఏపీలో చంద్రబాబు ఎన్ని నిధులు అడుగుతున్నా ఇంతకుముందు ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడుగుతుండటం... తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్‌కు భుజంపై చేయి వేసి మాట్లాడటం వరకు మోడీ చేసే ప్రతి చర్య వెనుక ఆయా నేతల పట్ల ఉన్న ప్రజాభిప్రాయమే కారణమని తెలుస్తోంది. ప్రజల నాడిని పట్టుకోవడానికి ఒక మాస్ మెకానిజం ఏర్పాటుచేసుకున్నారని.. అది బ్రహ్మాండంగా పనిచేస్తోందని తెలుస్తోంది.