గ్రూప్-1 పరీక్షలను తెలంగాణలో మరోసారి రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్‌వన్ పరీక్ష ప్రిలిమ్స్ రద్దు చేయడంతో ఈ పరీక్షలను మరోసారి నిర్వహించాలని హైకోర్టు తెలిపింది.
503 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం రెండుసార్లు ఎగ్జామ్ రాశారు. లీకేజీ ఆరోపణలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి సారి గ్రూప్-వన్ పరీక్షను రద్దు చేసింది. పకడ్బంధీగా రెండోసారి నిర్వహించాలని భావించారు.
రెండోసారి పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు తలెత్తాయి. దీంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పిటిషన్ వేశారు.
దీనిపై విచారించిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. వీలైనంత త్వరగా మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.