Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భర్త.. మనోవ్యధతో భార్య గుండె ఆగిపోయింది..

Advertiesment
car accident
, గురువారం, 9 నవంబరు 2023 (10:42 IST)
జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ మహిళ తీవ్రమైన మనోవ్యధకు లోనయ్యారు. భర్త లేని జీవితాన్ని కళ్ల ముందు ఊహించుకుని జీర్ణించుకోలేక పోయింది. రోజులు గడిచిపోతున్నప్పటికీ భర్త జ్ఞాపకాలను ఆమె బయటకు రాలేక పోయింది. దీంతో భర్త చనిపోయిన 20 రోజుల వ్యవధిలోనే భార్య కూడా ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామంలో జరిగింది.
 
ఈ గ్రామానికి చెందిన సాయిలు (39), యశోద (35) అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు (17)లు ఉన్నారు. సాయిలు ఆటో నడుపుతూ భార్యాపిల్లను పోషించుకుంటూ జీవిస్తున్నాడు. దంపతులిద్దరూ కష్టపడి ఇద్దరు కుమార్తెలకు వివాహం కూడా చేశారు. ఈ క్రమంలో అక్టోబరు 19వ తేదీన రేగోడు మండలం ఇటికాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిలు మృతి చెందాడు. 
 
ఈ పరిణామంతో కుంగిపోయిన యశోద ఈ నెల 5వ తేదీన గుండెపోటుకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ముగ్గురు పిల్లల రోదనను చూపరులను సైతం కన్నీరుపెట్టించాయి. గ్రామస్థులంతా కలిసి యశోదకు అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఓటర్ల ముసాయిదా జాబితాలో వింతలు.. భార్య పేరు 'డ'.. భర్త పేరు 'ట'