రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ, దేశ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసారు. రైతులను ఆదుకోవాలని కోరారు.
గత 90 రోజుల్లో ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసారనీ, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎరువుల సబ్సిడీని పక్కన పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. కేంద్రం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.