Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు తేదీల పొడగింపు

Advertiesment
students telangana
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (09:17 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష కోసం చెల్లించాల్సిన ఫీజు గడవును ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు పొడగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 26వ తేదీ నుంచి నవంబరు 14 తేదీ వరకు జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత అంటే నవంబరు 16 నుంచి 23వ తేదీ లోపు ఫీజు చెల్లించే విద్యార్థులు అదనంగా రూ.100 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 
 
అలాగే, నవంబరు 25 నుంచి డిసెంబరు 4వ తేదీ లోపు చెల్లించే విద్యార్థులు రూ.500 అదనపు ఫైన్‌తోనూ, డిసెంబరు 6వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలోపు ఫీజు చెల్లిస్తే రూ.1000 అపరాధం, డిసెంబరు 15 నుంచి 20వ తేదీలోపు ఫీజు చెల్లించే విద్యార్థులు రూ.2 వేల అపరాధం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 202-24 పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపులను ఎలాంటి అపరాధం లేకుండా నిర్ణీత గడువులోగా చెల్లించాలని కోరారు. 
 
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు : ఇప్పటివరకు రూ.347 కోట్ల సొత్తు స్వాధీనం 
 
నవంబరు నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఈ నెల 9వ తేదీ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీల్లో నిమగ్నమయ్యారు. ఈ తనిఖీల్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. అక్టోబరు 9వ తేదీ నుంచి గురువారం వరకు పోలీసులు జరిపిన విస్తృత తనిఖీల్లో ఇప్పటివరకు రూ.347.16 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అక్టోబరు 9వ తేదీ నుంచి ఇప్పటివరకు రూ.122.62 కోట్ల నగదును సీజ్ చేశారు. అలాగే, రూ.156.22 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.20.70 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. తనిఖీల్లో రూ.17.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల కోసం పంపిణీకి సిద్ధం చేసిన రూ.30.42 కోట్ల విలువైన కానుకలను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు : ఇప్పటివరకు రూ.347 కోట్ల సొత్తు స్వాధీనం