Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఎవరిపై ఎన్ని కేసులు

revanth reddy
, బుధవారం, 22 నవంబరు 2023 (14:29 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను విశ్లేషించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన 226 మంది అభ్యర్థులపై క్రమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించింది. 
 
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందని 360 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 78 మంది క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థులతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 58 మందిపై కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో కొందరిపై కేసులు నమోదయ్యాయి. కొందరిపై చిన్ని కేసులు మాత్రమే ఉన్నాయని... అయినా కేసులను పరిగణనలోకి తీసుకున్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది.
 
కాంగ్రెస్ పార్టీ తరపున 118 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అత్యధిక కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయనపై 89 కేసులు ఉన్నాయి. 52 కేసులతో ఖనాపూర్ నియోజకవర్గానికి చెందిన వెడ్మ బొజ్జు (కాంగ్రెస్), 32 కేసులతో కరీంనగర్ అభ్యర్థి పురుమల్ శ్రీనివాస్ ఉన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై 20 కేసులు నమోదయ్యాయి.
 
బీజేపీ విషయానికి వస్తే గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్‌పై కూడా రేవంత్ రెడ్డితో సమానంగా 89 కేసులు ఉన్నాయి. బండి సంజయ్‌పై 59 కేసులు ఉన్నాయి. ఈటల రాజేందర్‌పై 40 కేసులు, రఘునందన్ రావుపై 27 కేసులు ఉన్నాయి. ఇక అధికార భారత రాష్ట్ర సమితి విషయానికి వస్తే... 58 మందిపై కేసులు ఉన్నాయి. మంత్రి గంగుల కమలాకర్ 10 కేసులతో తొలి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 9 కేసులు, కేటీఆర్‌పై 8 కేసులు ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఆరు కేసులు ఉన్నాయి. కొందరు అభ్యర్థులపై 15 నుంచి 20 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరు మెట్రోలో యువతులకు లైంగిక వేధింపులు