కూచిభొట్ల భార్యకు అమెరికా వీసా మంజూరు
అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి అమెరికా వీసాను మంజూరు చేసింది. ఆ దేశ ఎంపీ యోడర్ కృషి ఫలితంగా ఈ వీసా మంజూరుకావడం గమనార్హం.
అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి అమెరికా వీసాను మంజూరు చేసింది. ఆ దేశ ఎంపీ యోడర్ కృషి ఫలితంగా ఈ వీసా మంజూరుకావడం గమనార్హం.
గత ఫిబ్రవరిలో శ్రీనివాస్ కూచిభొట్ల అమెరికాలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. భర్త అంత్యక్రియల కోసం శ్రీనివాస్ భార్య సునయన భారత్‌కు వచ్చారు. దీంతో ఆమె అమెరికాలో నివశించే హక్కును కోల్పోయారు.
ఈ నేపథ్యంలో తనకు అమెరికాలో ఉండటానికి, అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆమె ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వర్క్ వీసా మంజూరు కోసం ఆ దేశానికి చెందిన ఎంపీ యోడర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చివరికి సునయనకు తాత్కాలిక వర్క్ వీసా మంజూరు చేసింది.