Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగుల చవితి రోజు.. నాగమ్మ తల్లి ప్రత్యక్షం.. పుట్టలో కాదు.. బిందెలో?!

Advertiesment
Snake
నాగుల చవితి రోజు.. నాగమ్మ తల్లి ప్రత్యక్షం అయ్యింది. అయితే అది పుట్టలో కాదు.. బిందెలో అదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఇంట్లో ఆరడుగుల భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. 
 
అర్థరాత్రి ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో వారిని భయాందోళనలకు గురయ్యేలా చేసింది. ఎలుకలు తిని కదలని పరిస్థితిలో ఉన్న నాగుపాముని ఆ కుటుంబ సభ్యులు ఇత్తడి బిందెలో పట్టి ఉంచారు. 
 
పాముకు ఎలాంటి అపాయం తలపెట్టకుండా పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో దానిని పట్టుకొని సమీప అడవిలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలు.. ఆరుగురు చిన్నారులు.. అగ్నికి ఆహుతి