Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అటవీ రేంజ్ ఆఫీసర్‌ చేయి విరగ్గొట్టిన ఎమ్మెల్యే తమ్ముడు

అటవీ రేంజ్ ఆఫీసర్‌ చేయి విరగ్గొట్టిన ఎమ్మెల్యే తమ్ముడు
, ఆదివారం, 30 జూన్ 2019 (11:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరే కృష్ణ, తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ అనితపై వెదురు బొంగులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె చేయి విరిగిపోయింది. దీంతో ఆమెను సిర్పూర్ కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 
 
కాళ్వేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులను అటవీ శాఖ అధికారులు కొంతమంది పోలీసుల సహాయంతో చేపట్టారు. అయితే, ఈ పనులను సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ ఛైర్మన్ అయిన కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. 
 
అంతేకాకుండా, తమ మాట వినని అటవీశాఖ అధికారులపై భౌతికదాడులకు దిగారు. ఈ దాడిలో స్వయంగా కోనేరు కృష్ణ పాల్గొనడం గమనార్హం. ఈ దాడి కూడా పోలీసుల సమక్షంలో జరిగింది. ముఖ్యంగా, ట్రాక్టర్ డ్రైవర్‌పై కోనేరు కృష్ణ అనుచరులు దాడికి యత్నించగా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెపై కృష్ణ ప్రధాన అనుచరులు వెందురు బొంగులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెతో పాటు.. ఈ దాడిలో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ ఇకలేరు