వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ విమర్శించారు. ట్విట్టర్‌లో తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
2017వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్.. ఐదేళ్లవుతున్నా ఇప్పటిదాకా అమలు చేసింది లేదని షర్మిల వెల్లడించారు.
అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు తిరిగి ఇచ్చింది లేదు. ఇంటికో పెన్షనంటూ మెలికలు పెట్టి, పథకాన్ని అటకెక్కించి, వృద్ధాప్య మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారు.
ఆసరా పెన్షన్స్‌తో సంబంధం లేకుండా అభయహస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలని లేదంటే మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు.