Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్‌, దేశానికి మోదీ చేసింది ఏమి లేదు: వైఎస్ షర్మిల ఫైర్

Advertiesment
sharmila
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ.. ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారు. రాష్ట్రానికి కేసీఆర్‌, దేశానికి మోదీ చేసింది ఏమి లేదని మండిపడ్డారు. 
 
మోదీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే.. తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడింది లేదని షర్మిల ఫైర్ అయ్యారు.
 
కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించింది లేదు. రేపు రాబోవు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని.. నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు.. టీఆర్ఎస్, బీజేపీలు లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపాయని ఫైర్ అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విట్టర్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం