Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పడక సుఖానికి అడ్డొస్తున్నాడనీ.... బాలుడ్ని చంపిన కామాంధుడు

పడక సుఖానికి అడ్డొస్తున్నాడనీ.... బాలుడ్ని చంపిన కామాంధుడు
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (08:35 IST)
తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ఓ కామాంధుడు.. యేడాదిన్నర బాలుడిని ఓ కామాంధుడు హత్య చేశాడు. ఆ తర్వాత ఫిట్స్ కారణంగా చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెంది బర్మా మౌనిక అనే మహిళ భర్త అజయ్‌లాల్‌తో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఈమెకు రోహిత్‌ అనే 18 నెలలు బాలుడు ఉన్నాడు. 
 
ఒంటరిగా జీవిస్తున్న ఈ మహిళకు దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌లో నివాసం ఉండే వాషింగ్‌మెషిన్‌‌ టెక్నీషియన్‌ మద్దికుంట రాజుతో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత రాజు, మౌనికలు సహజీవనం చేస్తూ వచ్చారు. 
 
అయితే, మౌనికతో ఏకాంతంగా ఉండేందుకు 18 నెలల బాలుడు అడ్డుగా ఉన్నాడు. దీన్ని రాజు జీర్ణించుకోలేక పోయాడు. ఈ క్రమంలో ఈ నెల 28న మౌనిక పనిమీద బయటకు వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన రాజు బాలుడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించి తీవ్రంగా చాతీపై కొట్టాడు. 
 
దీంతో గాయపడిన బాలుడికి.. ఫిట్స్‌ వచ్చాయని ఇరుగుపొరుగు వారిని నమ్మించి, మౌనికకు ఫోన్‌ చేసి చెప్పి స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక రోదిస్తూ తన భర్త అజయ్‌లాల్‌కు ఫోన్‌ చేసి బాబు ఫిట్స్‌తో చనిపోయాడని తెలిపింది. 
 
అయితే వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అజయ్‌లాల్‌ (బోరబండ, మధురానగర్‌ నివాసి) మొదట పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు 29న ఉదయం సరూర్‌నగర్‌ పోలీసులకు కేసు బదిలీ చేశారు. అజయ్‌లాల్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. 
 
పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా బయటకు కనబడని గాయాల వల్లే బాబు ప్రాణాలు పోయినట్లు తేలింది. దీంతో అనుమానంతో మద్దికుంట రాజును పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే కొట్టి చంపినట్లు అంగీకరించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రాజు వేసిన పథకం బెడిసి కొట్టింది. ఈ మేరకు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్ - అస్సాంలలో రెండో దశ పోలింగ్ : మమత భవితవ్యం తేల్చనున్న ఓటర్లు